Salman Khan: సల్మాన్ కు లేడీ రిపోర్టర్ పెళ్లి ప్రపోజల్.. కండల వీరుడి స్పందన అదుర్స్.. ఇదిగో వీడియో!

salman khan gets marriage proposal from journalist heres how the actor reacts

  • ఐఫా వేడుకల్లో సందడి చేసిన సల్మాన్ ఖాన్
  • మీడియా సమావేశంలో ప్రపోజ్ చేసిన లేడీ రిపోర్టర్
  • సల్మాన్ కోసమే హాలీవుడ్ నుంచి వచ్చానని వెల్లడి
  • 20 ఏళ్ల క్రితం కలిసి ఉంటే బాగుండేదన్న సల్లూభాయ్

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ప్రేమాయణాలు సాగించినా.. వాటిని పెళ్లి దాకా తీసుకురాలేకపోయాడు. మాజీ ప్రియురాళ్లంతా మంచి వాళ్లని, తప్పంతా తనదేనని ఒప్పుకున్నాడు కూడా. 57 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా ‘సింగిల్’గానే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయనకో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. కానీ తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా)-2023 వేడుకలు దుబాయ్ లో జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి చాలా మంది తారలు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో సల్మాన్ మాట్లాడుతుండగా.. ఓ లేడీ రిపోర్టర్ ప్రపోజ్ చేసింది. ‘‘సల్మాన్ మీ కోసమే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడిపోయాను’’ అని ఆమె చెబుతుండగానే.. ‘‘మీరు షారుక్ గురించి మాట్లాడుతున్నారు కదా’’ అంటూ సల్మాన్ జోక్ చేశారు.

దీంతో ఆమె.. ‘‘లేదు.. నేను సల్మాన్ గురించే మాట్లాడుతున్నా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’’ అని మళ్లీ అడిగింది. దీంతో సల్మాన్ కాస్త నిరాశను ప్రదర్శిస్తూ.. ‘‘నాకు పెళ్లి వయసు దాటిపోయింది.. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది’’ అని సరదాగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Salman Khan
marriage proposal
journalist
IIFA-2023
Bollywood
  • Loading...

More Telugu News