ఒకేసారి దాడి చేసిన 40 మొసళ్లు..వృద్ధుడి దారుణ మరణం
- కాంబోడియాలో దారుణ ఘటన
- మొసళ్ల పెంపకం చేపట్టిన వ్యక్తి
- ఓ మొసలి గుడ్లు పెట్టడంతో వాటిని సేకరించేందుకు ప్రయత్నం
- మొసలిని కర్రతో పక్కకు తోసే క్రమంలో బోనులో పడ్డ వృద్ధుడు
- బోనులో 40 మొసళ్లు ఒక్కసారిగా దాడి చేయడంతో దారుణ మరణం
ఈ క్రమంలో మొసలి వృద్ధుడి చేతిలోని కర్రను పట్టిలాగడంతో ఆయన బోనులో పడిపోయాడు. దీంతో, అక్కడ ఉన్న మొసళ్లన్నీ ఒక్కసారిగా ఆయనపై దాడి చేశాయి. శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ మేరకు స్థానిక పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, సియేమ్ రీప్ ప్రాంతం మొసళ్ల పెంపకానికి ప్రసిద్ధి. మొసళ్ల గుడ్లు, చర్మం, మాంసం కోసం స్థానికులు వీటిని భారీ సంఖ్యలో పెంచుతుంటారు.