Srikakulam District: టెక్కలి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

Duvvada Vani to contest from Tekkali next electiions
  • ఇటీవల దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన జగన్
  • భార్య వాణితో కలిసి జగన్‌ను కలిసిన శ్రీనివాస్
  • తనకే టికెట్ ఇవ్వాలని కోరిన వాణి
  • నిన్న అధికారికంగా ఆమె పేరు ప్రకటన
వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేసే అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. దువ్వాడ వాణికి టికెట్ కేటాయిస్తున్నట్టు పార్టీ అధికారికంగా నిన్న ప్రకటించింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ తన భార్య వాణితో కలిసి జగన్‌ను కలిశారు.

టెక్కలి టికెట్‌ను తనకే ఇవ్వాలని జగన్‌ను వాణి అభ్యర్థించారు. దీంతో సీటు ఎవరికి కావాలో తేల్చుకోవాలని జగన్ వారికి సూచించారు. చివరికి వాణినే బరిలోకి దించాలని శ్రీనివాస్ కూడా నిర్ణయించడంతో వైసీపీ నిన్న ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.
Srikakulam District
Tekkali
Duvvada Vani

More Telugu News