నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. పది గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
- ప్రతి రెండేళ్లకు ఒకసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
- కరోనా కారణంగా ఈసారి ఆలస్యం
- అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి ఓటింగ్
- సాయంత్రం ఏడు గంటలకు అధ్యక్షుడి పేరు ప్రకటన
- చంద్రబాబు ఎన్నిక లాంఛనమేనంటున్న నేతలు
నిజానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ కాగా, కరోనా కారణంగా ఈసారి జాప్యం జరిగింది. ఈ ఎన్నిక కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీని పొలిట్ బ్యూరో నియమించింది. ఇందులో పార్టీ నాయకులు అశోక్ గజపతిరాజు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఫరూక్ తదితరులు పర్యవేక్షకులుగా ఉంటారు.