హస్తిన చేరుకున్న సీఎం జగన్

  • ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  
  • నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్
  • నేటి సాయంత్రం నిర్మలా సీతారామన్ తో భేటీ
CM Jagan arrives Delhi ahead of NITI AAYOG meeting

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. హస్తినలో అడుగుపెట్టిన ఆయనకు వైసీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

ఢిల్లీలో రేపు కేంద్రం ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. 

కాగా, ఈ సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాలపై ఆమెతో చర్చించనున్నారు.

More Telugu News