Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
  • 629 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఈ ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి దూసుకుపోయాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 62,502కి పెరిగింది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 18,499కి ఎగబాకింది. పలు ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో మన మార్కెట్లు కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (2.79%), సన్ ఫార్మా (2.36%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.89%), విప్రో (1.85%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.61%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.36%), ఎన్టీపీసీ (-0.03%).

More Telugu News