IPL: మోదీ స్టేడియంలో అదిరిపోయేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు

IPL closing ceremony will be graced with a rocking performance by Indian singers
  • ముగింపు దశకు ఐపీఎల్ 16వ సీజన్
  • నేడు క్వాలిఫయర్-2.. ఎల్లుండి ఫైనల్ మ్యాచ్
  • ఫైనల్ మ్యాచ్ కు ముందు దేశీయ సంగీతకారుల పెర్ఫార్మెన్స్
రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా... ఇందులో గెలిచిన జట్టు మే 28న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. 

కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీసీఐ... ఫైనల్ మ్యాచ్ ముందు ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దేశీయ సంగీతకారులతో మనోరంజక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. వివియన్ డివైన్, జోనిటా గాంధీ, కింగ్, న్యూక్లియా తమ ఆట పాటతో అలరించనున్నారు.
IPL
Closing Ceremony
Narendra Modi Stadium
Ahmedabad
Final
Indian Singers

More Telugu News