మోదీ స్టేడియంలో అదిరిపోయేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు
- ముగింపు దశకు ఐపీఎల్ 16వ సీజన్
- నేడు క్వాలిఫయర్-2.. ఎల్లుండి ఫైనల్ మ్యాచ్
- ఫైనల్ మ్యాచ్ కు ముందు దేశీయ సంగీతకారుల పెర్ఫార్మెన్స్
కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీసీఐ... ఫైనల్ మ్యాచ్ ముందు ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దేశీయ సంగీతకారులతో మనోరంజక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. వివియన్ డివైన్, జోనిటా గాంధీ, కింగ్, న్యూక్లియా తమ ఆట పాటతో అలరించనున్నారు.
