భారత్ లో ఉన్నత ఉద్యోగులపై మెటా వేటు
- జాబితాలో మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్,
మీడియా పార్ట్ నర్షిప్స్ డైరెక్టర్ సౌరభ్ - పరిపాలన, మానవ వనరులు, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు
- ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్స్ ప్రకటించిన సీఈవో జుకర్ బర్గ్
వేటు ఎదుర్కొన్న వారిలో భారత మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్ నర్షిప్స్ డైరెక్టర్ సౌరభ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్ కంపెనీ గతంలో తొలగించిన ఉద్యోగులకు అందించిన పరిహార ప్యాకేజీని తాజాగా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఇస్తోందని మాజీ మెటా ఉద్యోగి వెల్లడించారు. ఈ ప్యాకేజీ దాదాపు 3 నెలల మూల వేతనంతో సమానంగా ఉంటుందని తెలిపారు.