Virat Kohli: భారత క్రికెటర్లలో ఈ రికార్డు కోహ్లీకే సొంతం..!

Virat Kohli becomes only Indian to reach 250 million Instagram
  • ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారత ఆటగాడు
  • ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల్లో మూడో స్థానం
  • ఇన్ స్టా లో కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 25 కోట్లు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు మరే భారత క్రికెటర్ కూ సాధ్యం కాని ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఇన్ స్టా గ్రామ్’పై 25 కోట్ల మంది ఫాలోవర్లు కోహ్లీకి తోడయ్యారు. నిజానికి ఈ మైలురాయి మరో క్రికెటర్ కు సాధ్యమవుతుందో, లేదో కూడా తెలియదు. అంతేకాదు మరే భారత క్రీడాకారుడు, క్రీడాకారిణికి కూడా ఇంత మంది ఫాలోవర్లు లేరు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

కోహ్లీ కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీకి ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ అటు టీమిండియాకి, ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్ గా చాలా కాలం పాటు సేవలు అందించాడు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఇన్ స్టా గ్రామ్ లో కేవలం 4 కోట్ల మందే ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ ను 3.79 కోట్ల మందే ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతున్నారు. విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండడం, మిగిలిన ఇద్దరితో పోలిస్తే యువ క్రికెటర్ కావడం, ప్రస్తుతం టీమిండియాలో సభ్యుడిగా ఉండడం ఇవన్నీ సానుకూలతలు.
Virat Kohli
milestone
record
Instagram
followers
highest

More Telugu News