director Teja: కూతురు పెళ్లి విషయంలో డైరెక్టర్ తేజ బోల్డ్ కామెంట్స్​!

Director Teja bold comments about his daughter marriage goes viral
  • నచ్చిన వాడిని చూసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పానని వెల్లడి
  • పెళ్లయ్యాక భర్త నచ్చకుంటే విడాకులు ఇచ్చేయమంటానని వ్యాఖ్య
  • కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానంటున్న తేజ
సినిమా, సమాజం, నిజ జీవితంలో ఏ విషయం గురించి అయినా తన ఆలోచనను సూటిగా, స్పష్టంగా చెబుతుంటారు దర్శకుడు తేజ. వివాదాస్పద అంశాలపైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. తాజాగా తన కూతురు గురించి ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు.

 విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని వచ్చిన ఆమె పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తాను పెళ్లి చేయనని తేజ చెప్పారు. నచ్చిన వాడిని చూసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని కూతురుకు చెప్పానని వెల్లడించారు. ఒకవేళ పెళ్లయ్యాక భర్త నచ్చకపోతే విడాకులు ఇచ్చేయమని చెబుతానని తేజ బోల్డ్ కామెంట్స్ చేశారు. 

వ్యక్తిగత జీవితంలో మనం సంతోషంగా బతకడం ముఖ్యమన్న ఆయన.. లోకం ఏమనుకుంటుందనేది మనకు అనవసరమని స్పష్టం చేశారు. ఇక త్వరలోనే తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానని చెప్పారు. ఇప్పటికే నటన, దర్శకత్వంలో శిక్షణ కోర్సు పూర్తి చేశాడని తెలిపారు. తేజ ప్రస్తుతం ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది.
director Teja
daughter marriage
comments
viral
Tollywood

More Telugu News