YS Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల

MP Avinash Reddy mother health bulletin released
  • ఇటీవల అస్వస్థతకు గురైన అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి
  • కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలింపు
  • కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స
  • శ్రీలక్ష్మికి వాంతులు తగ్గాయని తాజా బులెటిన్ లో వెల్లడి
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కొన్నిరోజుల కిందట అస్వస్థతకు గురైన శ్రీలక్ష్మిని పులివెందుల నుంచి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైందని బులెటిన్ లో వెల్లడించారు. వాంతులు తగ్గాయని వివరించారు. త్వరలోనే ఐసీయూ నుంచి సాధారణ వార్డు రూమ్ కు తరలిస్తామని వైద్యులు తెలిపారు. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యం అంటూ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే.

More Telugu News

YS Avinash Reddy
Sri Lakshmi
Health Bulletin
Viswa Bharathi Hospital
Kurnool
YSRCP
Andhra Pradesh