Modi: ప్రధానిగా మోదీ పాలనకు తొమ్మిదేళ్లు.. దేశవ్యాప్తంగా సంబరాలకు బీజేపీ ఏర్పాట్లు

  • మన ప్రధానమంత్రులలో స్వాతంత్ర్యానంతరం పుట్టిన ప్రధాని మోదీ ఒక్కరే
  • రెండోసారి స్పష్టమైన మెజారిటీతో పదవి చేపట్టిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు
  • ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగాను, ప్రధానిగానూ సేవలందించిన మోదీ 
Nine Lesser Known Facts About Prime Minister Narendra Modi

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి శుక్రవారం నాటికి తొమ్మిదేళ్లు.. 2014 మే 26న ప్రధానమంత్రి పదవి చేపట్టిన మోదీ, 2019లో మే 30 న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా సంబరాలకు ఏర్పాట్లు చేసింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.. 

  • దేశానికి ప్రధానమంత్రిగా ఇప్పటి వరకు సేవలందించిన వారిలో నరేంద్ర మోదీ మాత్రమే స్వాతంత్ర్యానంతరం పుట్టారు. అంతకుముందు ప్రధానమంత్రులంతా మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జన్మించిన వారే. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసి, ప్రధానిగానూ సేవలందించిన లీడర్ మోదీ ఒక్కరే!
  • ఎమర్జెన్సీ సమయంలో అరెస్టును తప్పించుకోవడానికి, అరెస్టయిన అగ్రనేతలకు సమాచారం అందించడానికి మోదీ సిక్కు యువకుడిలా వేషం ధరించి పోలీసులను బోల్తా కొట్టించారు.
  • చిన్నతనంలో మోదీ టీ అమ్మారని చాలామందికి తెలిసిందే. రైల్వే స్టేషన్ లోని టీ స్టాల్ లో తండ్రికి ఆయన సాయం చేసేవారు. ఇంటికి మరమ్మతులు చేయించడానికి అవసరమైన డబ్బు కోసం మోదీ నాటకాలలో పాల్గొన్నారు.
  • భారతీయ జనతా పార్టీతో జతకట్టడానికి ముందు మోదీ పూర్తిస్థాయి ఆరఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశారు.
  • ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి తెలుసుకున్న మోదీ.. లక్ష్మణ్ రావు ఇనామ్ దార్ ను కలుసుకున్నారు. ఆయన మోదీని జూనియర్ క్యాడెట్ గా చేర్చారు.
  • శాసన సభలో సభ్యత్వంలేకున్నా 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు.
  • దేశంలో రెండోసారి స్పష్టమైన మెజారిటీతో బాధ్యతలు చేపట్టిన ప్రధానులు ఇందిరాగాంధీ, మోదీ ఇద్దరే!
  • ప్రధాని మోదీ పలు పుస్తకాలను ప్రచురించారు. పద్యాలు రాయడమన్నా, ఫొటోగ్రఫీ అన్నా ఆయనకు చాలా ఇష్టం. 
  • ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో 2018లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా ప్రధాని మోదీ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

More Telugu News