Old City: అర్ధరాత్రి దుర్వాసన.. పాతబస్తీలో జనం పరేషాన్

  • హైదరాబాద్ లో బుధవారం రాత్రి ఘటన
  • భయాందోళనలతో రాత్రంతా జాగారం చేసిన ప్రజలు
  • వాంతులు చేసుకున్న చిన్నారులు
Old City People Panic wednessday night After Bad smell

ఆదమరిచి నిద్రపోయే వేళ ఘాటైన వాసనతో పాతబస్తీ జనం అర్ధరాత్రి నిద్రలేచారు.. భరించలేని దుర్వాసన ఎంతసేపటికీ పోకపోవడంతో ఏం జరుగుతోందోనని భయందోళనలకు లోనయ్యారు. వాసన భరించలేక పిల్లలు వాంతులు చేసుకోగా, పెద్దవాళ్లు అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టప్పాచబుత్ర, యూసుఫ్ నగర్, కార్వాన్, నటరాజనగర్, మహేష్ కాలనీ తదితర ప్రాంతాల వాసులు ఈ దుర్వాసనకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు.

దాదాపు గంటన్నర పాటు ఇబ్బంది పెట్టిన దుర్వాసన ఆగిపోయాక జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాసన ఎక్కడి నుంచి వస్తోందనే విషయాన్ని ఎంత ప్రయత్నించినా పోలీసులు కనుక్కోలేకపోయారు. కాగా, గతంలో ఇండస్ట్రియల్ ఏరియాలు బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని బస్తీల వాసులకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే, పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు కలవడమే కారణమని అధికారులు అప్పట్లో తేల్చారు.

More Telugu News