కొత్త లోక్‌సభలో రాజదండం.. ప్రతిష్ఠించనున్న మోదీ
- బ్రిటిషర్ల నుంచి అధికార మార్పిడి సందర్భంగా రాజదండం
- 14 ఆగస్టు 1947న నెహ్రూకి అందించిన లార్డ్ మౌంట్‌బాటన్
- 28న సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠాపన
- హాజరు కానున్న ఉమ్మిడి బంగారుశెట్టి
ఐదడుగులకుపైగా పొడవుతో బంగారు పూత కలిగిన ఈ వెండిదండం పైభాగంలో న్యాయానికి ప్రతీక అయిన నంది చిహ్నం చెక్కారు. గతేడాది వరకు ఇది గుజరాత్‌లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబరు 4న దానిని అక్కడి నుంచి శాశ్వత ప్రాతిపదికన ఢిల్లీ జాతీయ మ్యూజియానికి తరలించారు. కాగా, 14 ఆగస్టు 1947న రాజదండాన్ని బ్రిటిషర్లు నెహ్రూకు అందించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మిడి బంగారు శెట్టి (96) కూడా ప్రతిష్ఠాపక కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.