MS Dhoni: ధోనీ మరికొన్నేళ్ల పాటు ఆడొచ్చు..: డ్వేన్ బ్రావో

MS Dhoni can prolong his career with Impact Player rule says Dwayne Bravo after CSK reach final
  • ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అక్కరకు వస్తుందన్న అభిప్రాయం
  • వచ్చే సీజన్ కు నూటికి నూరు శాతం ఆడతాడన్న ధీమా
  • ధోనీ సామర్థ్యాలు అసాధారణమని కితాబు
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా సంవత్సరాల పాటు సేవలు అందించిన వారిలో డ్వేన్ బ్రావో గురించి చెప్పుకోవాలి. గత సీజన్ వరకు సీఎస్కే బౌలర్ గా కొనసాగిన బ్రావో.. ఈ సీజన్ నుంచి బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. నిన్న ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై విజయం తర్వాత బ్రావో మీడియాతో మాట్లాడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ధోనీ తన ఐపీఎల్ కెరీర్ ను కొనసాగించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

‘‘నూటికి నూరు శాతం (2024లో సీఎస్కే కోసం) అతడు ఆడతాడు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సాయం చేస్తుంది. అతడు (ధోనీ) తన కెరీర్ ను మరికొంత కాలం పాటు కొనసాగించొచ్చు. మేము బ్యాటింగ్ లో బలంగా ఉన్నాం. అజింక్య రహానే, శివమ్ దూబే ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్నారు. కనుక ధోనీ నుంచి పెద్దగా ఆశించక్కర్లేదు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా మార్చేయగల ధోనీ సామర్థ్యాలు అసాధారణం’’ అని బ్రావో పేర్కొన్నాడు.
MS Dhoni
IPL CAREER
Dwayne Bravo
impact player

More Telugu News