Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా.. ఎంపీ కోమటిరెడ్డి ప్రకటన

  • కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఎంపీ
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధింస్తుందని వెల్లడి
  • కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని వ్యాఖ్య
  • ప్రజలు తనను నల్గొండ జిల్లా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశాభావం
MP komati reddy venkatreddy hopeful of congress securing 70 assembly seats in the upcoming elections

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తనను నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద ఎంపీ మంగళవారం పార్టీ కార్యకర్తల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 26న ముఖ్యనాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

More Telugu News