Chiranjeevi: స్విట్జర్లాండ్ లో తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది: చిరంజీవి 

Chiranjeevi gives update about song with Tamannaah in Bhola Shankar
  • చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • మెహర్ రమేశ్ దర్శకత్వం
  • పాట కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన భోళాశంకర్ టీమ్
  • పిక్స్ లీక్ చేస్తున్నానంటూ చిరంజీవి ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఓ పాట చిత్రీకరణ కోసం చిత్రబృందం భూతల స్వర్గం స్విట్జర్లాండ్ వెళ్లింది. దీనిపై చిరంజీవి అప్ డేట్ ఇచ్చారు. 

స్విట్జర్లాండ్ లో కళ్లు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో 'భోళాశంకర్' కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగిందని వెల్లడించారు. ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చుతుందని, అభిమానులను మరింత మెప్పిస్తుందని చెప్పగలనని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం అంటూ ట్వీట్ చేశారు. అప్పటివరకు ఈ చిరు లీక్స్ పిక్స్ అంటూ చమత్కరించారు. స్విస్ లొకేషన్స్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను కూడా చిరంజీవి పంచుకున్నారు. 

అయితే, అభిమానులు తమకు తోచిన రీతిలో స్పందించారు. "ఒక సాంగ్ లీక్ చేయండి బాస్ అని ఒకరు"... "బాస్, గేమ్ చేంజర్ సినిమా గ్లింప్స్ లీక్ చేయవా" అని తలోరకంగా చిరును కోరారు.
Chiranjeevi
Bhola Shankar
Tamannaah
Song
Meher Ramesh
Switzerland
Tollywood

More Telugu News