Uma Harathi: సివిల్స్ లో ఆలిండియా మూడో ర్యాంక్ సాధించిన నారాయణపేట ఎస్పీ కుమార్తె ఉమాహారతి

Narayanapet SP Venkateswarlu daughter Uma Harathi gets All India 3rd Rank in UPSC Civils
  • సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
  • టాప్-5లో నిలిచిన ఉమా హారతి
  • నాలుగో ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించిన వైనం

తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్ లో టాప్-5లో నిలిచారు. ఆలిండియా లెవల్లో ఉమాహారతి 3వ ర్యాంకు సాధించారు. ఉమాహారతి ఎవరో కాదు... నారాయణపేట జిల్లా ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె. ఉమాహారతి గతంలోనూ మూడుసార్లు సివిల్స్ రాశారు. నాలుగో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించారు. ఉమా హారతి హైదరాబాద్ లో ఐఐటీ చేశారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుటుంబానికి జాతీయస్థాయి ర్యాంకులు కొత్త కాదు. ఉమాహారతి సోదరుడు సాయివికాస్ రెండేళ్ల కిందట ఆలిండియా ఇంజినీరింగ్ సర్వీస్ లో 12వ ర్యాంకు సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News