యూపీలో దారుణం.. భర్తను మంచానికి కట్టేసి భార్య, కుమార్తెపై అఘాయిత్యం
- రాంపూర్ జిల్లాలోని సైఫానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- బాధిత మహిళ, బాలికను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు
- ఇటీవల జరిగిన ఘటనే కారణమని పోలీసుల అనుమానం
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనక ఇటీవల జరిగిన ఘర్షణే కారణమని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. మెకానిక్‌తో ఇటీవల కొందరు వ్యక్తులు గొడవకు దిగారని, వారే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.