Jagan: పోలీసు శాఖ బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం... కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారులు

AP govt releases pending payments for police dept
  • చాలాకాలంగా పోలీసు శాఖకు బకాయిల పెండింగ్
  • ఇటీవల రూ.554 కోట్లు విడుదల
  • సీఎం జగన్ ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
పోలీస్ శాఖకు చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. పోలీసు శాఖకు చెందిన రూ.554 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాయంలో కలిశారు. బకాయిలు విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. 

సీఎం జగన్ ను కలిసినవారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్, ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Jagan
Police
Payments
Release
YSRCP
Andhra Pradesh

More Telugu News