యూట్యూబ్ లో ఇక అర నిమిషం పాటు ఆగకుండా యాడ్స్.. పూర్తిగా చూడాల్సిందే!
- కనెక్టెడ్ టీవీలో నాన్ స్కిప్ యాడ్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడి
- ఇప్పటికే అమలులో ఉన్న రెండు 15 సెకన్ల ప్రకటనలు
- టీవీ స్క్రీన్ పై యూట్యూబ్ వీక్షకుల సంఖ్య పెరగడంతో కంపెనీ నిర్ణయం
టీవీ స్క్రీన్ పై యూట్యూబ్ కంటెంట్ చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీంతో వివిధ కంటెంట్ లు ప్రసారమయ్యే సమయంలో ఇచ్చే యాడ్స్ ను గూగుల్ పెంచింది. ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్ పై ఎక్కువ నిడివి ఉన్న యాడ్స్ ను ప్రదర్శించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న పదిహేను సెకన్ల నాన్ స్కిప్ యాడ్స్ స్థానంలో 30 సెకన్ల యాడ్స్ ను ప్రసారం చేయనున్నట్లు ఓ బ్లాగ్ పోస్ట్ లో గూగుల్ తెలిపింది.