Shubman Gill: గుజరాత్ టైటాన్స్ గిల్ పై సచిన్ టెండుల్కర్ ప్రశంసల జల్లు

Shubman Gill batted well for MI Sachin Tendulkar cheeky tweet
  • ముంబై జట్టు కోసం కామెరాన్ గ్రీన్, గిల్ గొప్పగా ఆడారని కితాబు
  • అద్భుతమైన ఇన్సింగ్ ఆడాడంటూ కోహ్లీకి సైతం మెచ్చుకోలు
  • ముంబై ఇండియన్స్ ను ప్లే ఆఫ్ లో చూడడం పట్ల సంతోషం
ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అటు రాయల్ చాలెంజర్స్ జట్టులో విరాట్ కోహ్లీ  చేసిన శతకం వృథా అయింది. ఇటు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ చేసిన సెంచరీ మాత్రం క్లిక్ అయింది. గిల్ సెంచరీ గుజరాత్ కు మాత్రమే విజయాన్ని తెచ్చి పెట్టలేదు. ముంబై ఇండియన్స్ జట్టును ప్లే ఆఫ్ కు వెళ్లేలా చేసింది. ఒక పిట్టకు రెండు దెబ్బలు అన్నట్టు.. ఒక్క విజయంతో రెండు జట్లకు కలిసొచ్చినట్టు చెప్పుకోవాలి.

అందుకే గిల్ ను ముంబై ఇండియన్స్ టీమ్ మెంటార్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మనసారా మెచ్చుకున్నాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ పై ఓ చక్కని ట్వీట్ వదిలారు. ‘‘కామెరాన్ గ్రీన్, శుభ్ మన్ గిల్ ముంబై ఇండియన్స్ కోసం గొప్పగా బ్యాటింగ్ చేశారు’’ అని సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు విరాట్ కోహ్లీని సైతం మెచ్చుకున్నారు. ‘‘సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వారందరికీ వారికైన ప్రత్యేకమైన విధానం ఉంది. ప్లేఆఫ్ లో ముంబై ఇండియన్స్ ను చూడబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గో ముంబై’’ అని సచిన్ పేర్కొన్నారు.
Shubman Gill
batted well
Sachin Tendulkar
tweet
mumbai indians
ipl play off

More Telugu News