Virat Kohli: ఇలా కొడతాడు కాబట్టే కోహ్లీని కింగ్ అంటారు!

  • బెంగళూరులో ఆర్సీబీ × గుజరాత్ టైటాన్స్
  • కోహ్లీ సూపర్ సెంచరీ
  • 61 బంతుల్లో 101 నాటౌట్
  • కోహ్లీకి వరుసగా రెండో సెంచరీ
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసిన ఆర్సీబీ
King Kolhi registers back to back centuries

డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తనను అందరూ కింగ్ అని ఎందుకు అంటారో మరోసారి చాటిచెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరాలంటే నేడు గుజరాత్ టైటాన్స్ పై తప్పక నెగ్గాల్సిన స్థితిలో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. గుజరాత్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేస్తూ వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. 

కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కళాత్మకతకు పవర్ జోడించిన కోహ్లీ ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలకు మైమరిచిపోయింది. 

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినా, వికెట్లు పడుతున్నా చలించని కోహ్లీ పరుగుల వెల్లువ సృష్టించాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 28, మైకేల్ బ్రేస్వెల్ 26, అనుజ్ రావత్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. 

గ్లెన్ మ్యాక్స్ వెల్ (11), మహిపాల్ లోమ్రోర్ (1), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, మహ్మద్ షమీ 1, యశ్ దయాళ్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News