Manchu Manoj: అనాథాశ్రమంలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్

Manchu Manoj Celebrates His Birthday At Love And Care Orphanage Home In GajulaRamaram
  • గాజుల రామారంలోని ‘కేర్ అండ్ లవ్’ లో సందడి చేసిన మనోజ్
  • పిల్లలకు నోట్ బుక్స్, గిఫ్ట్స్ ఇచ్చిన హీరో
  • తాజా చిత్రం ‘వాట్ ది ఫిష్’ గ్లింప్స్ విడుదల
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన పుట్టిన రోజును అనాథ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా గాజుల రామారంలోని ‘కేర్ అండ్ లవ్’ ఆశ్రమానికి వెళ్లిన మనోజ్.. అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశారు. పిల్లల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఆడిపాడుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్ లు, స్వీట్లు పంచిపెట్టారు.

చిన్నారుల మధ్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మనోజ్ చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పిల్లలకు మరింత సేవ చేస్తానని మనోజ్ తెలిపారు. అనాథ పిల్లలతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మంచు మనోజ్ పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరోవైపు, తన పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ కొత్త సినిమా ‘వాట్ ది ఫిష్’ కు సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమాలో మనోజ్ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.
Manchu Manoj
Birthday
Orphanage Home
GajulaRamaram
Celebrations
what the fish
glimps

More Telugu News