Rapaka Vara Prasad: ఎమ్మెల్యే రాపాక కుమారుడి పెళ్లి కార్డుపై సీఎం జగన్ దంపతుల ఫొటోలు

CM Jagan and YS Bharathi photos on MLA Rapaka son wedding card
  • గత ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక
  • కాలక్రమంలో వైసీపీకి దగ్గరైన వైనం
  • జూన్ 7న రాపాక కుమారుడి వివాహం
  • సీఎం జగన్, భారతమ్మ దంపతుల ఆశీస్సులతో అంటూ పెళ్లికార్డు
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక. కాలక్రమంలో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం రాపాకకు జనసేన పార్టీతో ఏమాత్రం సంబంధాలు లేవనే చెప్పాలి. కాగా, జూన్ 7న రాపాక కుమారుడి వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఈ పెళ్లి కార్డుపై సీఎం జగన్ దంపతుల ఫొటోలు ముద్రించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీమతి భారతమ్మ గార్ల ఆశీస్సులతో" అంటూ పెళ్లి కార్డుపై పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ రాపాక వారి పెండ్లిపిలుపు బాగా సందడి చేస్తోంది.
Rapaka Vara Prasad
Son
Wedding Card
Jagan
YS Bharathi
Rajolu
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News