Rashmika Mandanna: ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలపై స్పందించిన రష్మిక మందన్న

Rashmika Mandanna reacts to Aishwarya Rajesh comment on her
  • పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రను ప్రస్తావించిన ఐశ్వర్య
  • అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని వ్యాఖ్య
  • దీన్ని తప్పుగా అన్వయించారంటూ వివరణ 
  • నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానంటూ రష్మిక కామెంట్
ఐశ్వర్య రాజేష్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ నటి రష్మిక మందన్న స్పందించింది. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర విషయంలో ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించగా, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె వివరణ ఇచ్చింది. వాస్తవంగా తానేమి మాట్లాడానన్న వివరణతో ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఏ విధంగానూ మెరుగ్గా ఉండనని ఐశ్వర్య రాజేష్ స్పష్టం చేసింది. కాకపోతే అలాంటి పాత్ర తనకు నప్పుతుందని చెప్పానంటూ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టు పేర్కొంది. రష్మిక పాత్ర పట్ల తనకు ఎంతో అభిమానం తప్పించి మరోటి లేదన్నారు. 

‘‘ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగు సినిమాలో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?’ అని నన్ను ప్రశ్నించారు. తెలుగు పరిశ్రమ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పా. నాకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానన్నాను. పుష్ప సినిమాలో శ్రీవల్లి తరహా పాత్ర అంటే తనకు ఎంతో  ఇష్టమని, అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని ఉదాహరణగా చెప్పాను. కానీ నా మాటలను వక్రీకరించి వేరే అర్థం వచ్చేలా రాశారు. సదరు సినిమాలో రష్మిక చేసిన అద్భుతమైన నటనను నేనేదో కించపరిచినట్టు చూపించారు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.

రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘‘హాయ్ లవ్.. నీవు ఏం చెప్పావో నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. మనకు మనం వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు. నీవంటే నాకు ప్రేమ, గౌవరం ఉన్నాయనేది నీకు తెలుసు’’ అని రష్మిక పేర్కొంది.
Rashmika Mandanna
reacts
Aishwarya Rajesh
comment
pushpa
srivalli

More Telugu News