ఫ్రీ సింబల్ జాబితాలోకి జనసేన ‘గాజు గ్లాసు’.. జనసేనకు ఈసీ షాక్
- ఎన్నికల నిబంధన ప్రకారం జనసేన పార్టీ గుర్తును లాగేసుకున్న ఈసీ
- అతి తక్కువ ఎన్నికల్లో పోటీ చేయడం, నిర్ణీత శాతం ఓట్లను సాధించడంలో విఫలం
- గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లోనూ జనసేన సింబల్ ఇతరులకు కేటాయింపు
2019 ఎన్నికల్లో ఆ పార్టీ 6 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణలో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.