హనీమూన్ కోసం రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన కొత్త పెళ్లికొడుకు.. రూ. 5 లక్షలు ఇవ్వడంతో భార్య అసభ్యకర ఫొటోలు తీసి బెదిరింపులు!
- ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఘటన
- ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం
- పెళ్లయిన వెంటనే భార్యను దూరం పెట్టిన భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
తనకు రూ. 10 లక్షలు ఇస్తేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని, లేదంటే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు రూ. 5 లక్షలు ఇచ్చుకున్నారు. డబ్బు అందుకున్నాక ఈ నెల 7న భార్యను హనీమూన్ కోసం నైనిటాల్ తీసుకెళ్లాడు. అక్కడ భార్య అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. మిగతా రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 13న పుట్టింటికి చేరుకుని భర్త, అత్తంటివారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.