Kacheguda-Visakha Express: విశాఖపట్టణం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు.. రేపటి నుంచే అమల్లోకి

Kacheguda Visakha Express Rail Extended to Mahbubnagar
షార్ట్స్‌లో చూడండి
మహబూబ్‌నగర్‌ వాసులకు ఇది శుభవార్తే. విశాఖపట్టణం-కాచిగూడ మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (12862/12861)ను మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కాచిగూడ వరకు నడుస్తున్న ఈ రైలు రేపటి నుంచి ఉందానగర్ (శంషాబాద్), జడ్చర్లలో ఆగుతుంది. 

మహబూబ్‌నగర్‌లో ఈ రైలు సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరి జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్ మీదుగా సాయంత్రం 6.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖలో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.45 గంటలకు కాచిగూడ, ఉదయం 9.20కి మహబూబ్‌నగర్ చేరుకుంటుంది.
Go Back to Shorts
Kacheguda-Visakha Express
Mahbubnagar
South Central Railway

More Telugu News