Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు.. ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్న పరమేశ్వర

  • ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడిన తర్వాత కొత్త సమస్య
  • ఉప ముఖ్యమంత్రి పదవి తమ వర్గానికి ఇవ్వాలని పరమేశ్వర డిమాండ్
  • లేదంటే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
congress g parameshwara says karnataka deputy cm post should given to me

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అంశానికి తెరపడగానే, కొత్త సమస్య వచ్చి పడింది. ఫలితాలు వెలువడిన రోజు నుండి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అయితే కొన్ని వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం లేదని మరికొందరు నేతలు వాపోతున్నారు. 

అధిష్ఠానం నిర్ణయంపై సీనియర్ నేత జి.పరమేశ్వర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. డీప్యూటీ సీఎం పదవిని ఆయన కూడా కోరుకుంటున్నారు.

More Telugu News