SRH: సొంతగడ్డపై అభిమానులను మురిపించేందుకు సన్ రైజర్స్ కు ఆఖరి చాన్స్

  • నేడు ఆర్సీబీతో తలపడుతున్న సన్ రైజర్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
  • ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
SRH plays on last time on home soil

ఐపీఎల్ తాజా సీజన్ లో ఆశించిన మేర రాణించని జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. పాయింట్ల పట్టికలో చివరన ఉన్న సన్ రైజర్స్ నేడు సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ సీజన్ కు సొంతగడ్డపై సన్ రైజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ప్లే ఆఫ్ అవకాశాలు ఇప్పటికే ఆవిరి కాగా, నేడు బెంగళూరుపై నెగ్గి సొంతగడ్డపై అభిమానులను అలరించాలని సన్ రైజర్స్ టీమ్ భావిస్తోంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు టోర్నీలో 13వ మ్యాచ్ కాగా, ఆఖరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 21న వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. 

ఇక, ఇవాళ ఆర్సీబీతో మ్యాచ్ కోసం సన్ రైజర్స్ టీమ్ లో బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్, పేసర్ కార్తీక్ త్యాగిలకు స్థానం కల్పించారు. ఈ మ్యాచ్ తో నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. అటు, ఆర్సీబీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు.

More Telugu News