Chandrababu: రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త మృతి... రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు

TDP Chief Chandrababu announces financial help to diseased TDP worker
  • గత నెలలో ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
  • యర్రగొండపాలెంలో ఉద్రిక్తతలు
  • రాజయ్య అనే టీడీపీ కార్యకర్తకు గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఏప్రిల్ 21న జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందాడని పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ గూండాల దాడిలో రాజయ్య తీవ్రంగా గాయపడ్డాడని, రాజయ్యను బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను కలచివేసిందని తెలిపారు. 

దశాబ్దాలుగా ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్తను పోగొట్టుకోవడం బాధాకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రాజయ్య కుటుంబానికి పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఆ రోజు రాళ్లదాడి చేసి రాజయ్య మృతికి కారణమైన మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Rajaiah
Yerragondapalem
TDP
Adimulapu Suresh
YSRCP
Prakasam District
Andhra Pradesh

More Telugu News