Abhishek Reddy: లింగాల మండల పర్యటనలో వైఎస్ అభిషేక్ రెడ్డి.. నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారా?

Is YS Abhishek Reddy gets Pulivendula constituency Responsibilities
  • కడప రాజకీయాల్లో సరికొత్త చర్చ
  • అభిషేక్‌రెడ్డి తెర ముందుకు రావడం ఇదే తొలిసారి
  • విశాఖలో వైద్య వృత్తిలో స్థిరపడిన అభిషేక్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి వైఎస్ అభిషేక్‌రెడ్డి కనిపించడం కడప రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమైంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో నిన్న వీరిద్దరూ పర్యటించారు. ఇప్పటి వరకు తెరవెనక ఉన్న అభిషేక్ రెడ్డి ఇప్పుడు బయటకు రావడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

విశాఖపట్టణంలో వైద్య వృత్తిలో స్థిరపడిన అభిషేక్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్‌రెడ్డికి మనవడు. అవినాశ్ రెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొనడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Abhishek Reddy
YSR Dist
YSRCP
YS Avinash Reddy

More Telugu News