పవన్ - సాయితేజ్ మూవీ ఫస్టు లుక్ రెడీ!

Pavan and Sujeeth movie update
  • తమిళ రీమేక్ గా పవన్ - సాయితేజ్ సినిమా
  • డిఫరెంట్ జోనర్లో రూపొందుతున్న సినిమా  
  • తెలుగులోను సముద్రఖనినే దర్శకుడు 
  • రేపు సాయంత్రం ఫస్టు లుక్ రిలీజ్
పవన్ కల్యాణ్ - సాయితేజ్ కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. చిరూతో తప్ప మెగా ఫ్యామిలీలోని ఏ హీరోతోను పవన్ ఇంతవరకూ కలిసి నటించలేదు. అలాంటిది మొదటిసారిగా ఆయన సాయితేజ్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రేపు సాయంత్రం 4:14 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ఖరారు చేయలేదు. రేపు టైటిల్ తో కూడిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ఇవ్వనున్నారు.   

తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. 2021 అక్టోబర్లో విడుదలైన ఆ సినిమా అక్కడ సక్సెస్ టాక్ ను అందుకుంది. ఈ కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ జోనర్లోకి వస్తుంది. అందువలన తెలుగు కాంబినేషన్ కూడా కాస్త చిత్రంగా అనిపిస్తుంది. సముద్రఖని దర్శకుడిగా కూడా తెలుగులో తన సత్తా చాటనున్నాడన్న మాట.
Go Back to Shorts
Pavan Kalyan
Saitej
Samudrakhani

More Telugu News