DK Shivakumar: ఆ వార్తల్లో నిజం లేదు: డీకే శివకుమార్

DK Sivakumar reacts to speculations that he is going to resign
  • ఇంకా తేలని కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం
  • హస్తినలో వరుస సమావేశాలు
  • తాను పీసీసీకి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్న డీకే
  • కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిదని వెల్లడి
  • కర్ణాటక కాంగ్రెస్ నిర్మాణంలో తనదే ముఖ్య పాత్ర అని ఉద్ఘాటన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఒకెత్తయితే, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నది తేల్చడం మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ నెల 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా... నూతన సీఎం ఎవరన్నదానిపై ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం హస్తినకు చేరింది. 

అధిష్ఠానంతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ రథ సారథి డీకే శివకుమార్ తాజా ఊహాగానాలపై స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పీసీసీ పదవికి తాను రాజీనామా చేయడంలేదని డీకే శివకుమార్ వెల్లడించారు. 

కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిదని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో అడుగడుగునా తమ పాత్ర ఉందని ఉద్ఘాటించారు. కాగా, కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం నేపథ్యంలో డీకే శివకుమార్ కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు.
DK Shivakumar
PCC
Congress
Karnataka

More Telugu News