Congress: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు

  • కర్ణాటక ఫలితాల తర్వాత కూడా బీజేపీకి జ్ఞానోదయం కాలేదని వ్యాఖ్య
  • ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కాంగ్రెస్ సీఎంను ఎంపిక చేసుకోలేకపోతోందన్న గుత్తా
  • వచ్చేసారి 100 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా
Gutta fires at BJP and Congress

కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత అయినా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలో మతకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నాలుగు రోజులు అయినప్పటికీ.... మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ... అంతర్గత కుమ్ములాటలతో సీఎంను కాంగ్రెస్ ఎంపిక చేసుకోలేకపోతోందని గుత్తా అన్నారు.

రాజస్థాన్ లోను ఆ పార్టీలో సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాల మద్దతు లేకుండానే తాము రెండుసార్లు అధికారంలోకి వచ్చామని చెప్పారు.

More Telugu News