Salaar: వెనక్కి వెళ్లే చాన్సే లేదు.. చెప్పిన డేట్ పక్కా: సలార్‌ విడుదలపై మేకర్స్ క్లారిటీ

prashanth neel team gives clarity on salaar release date rumours
  • సలార్ విడుదల ఆలస్యం కానుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు
  • క్లారిటీ ఇవ్వాల్సిందిగా నెటిజన్ల రిక్వెస్టులు 
  • స్పందించిన చిత్ర బృందం.. సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయనున్నట్లు వెల్లడి
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘సలార్‌’. కేజీఎఫ్ సెన్సేషన్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని వచ్చే సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.  

అయితే సలార్‌ గురించి ఓ గాసిప్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం సలార్ థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే డైలామాలో ప్రభాస్‌ అభిమానులు పడిపోయారు. సలార్ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నెటిజన్లు, ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో పుకార్లపై సలార్‌ టీం స్పష్టతనిచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2023 సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుందని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని కోరింది.

సలార్ షూటింగ్ ప్రస్తుత తుది దశలో ఉంది. కేజీఎఫ్‌ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్‌ తన హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం ఆదిపురుష్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఆదిపురుష్‌ విడుదల కానుంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కే’, మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘రాజా డీలక్స్’ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు.
Salaar
Prabhas
Prashanth Neel
Vijay Kiragandur
Hombale Films

More Telugu News