bus: హైదరాబాద్-విజయవాడ మధ్య రేపటి నుండి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

  • ప్రయాణికులకు అందుబాటులోకి పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
  • మంగళవారం నుండి అందుబాటులోకి 10 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
  • అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో ఈ-గరుడ బస్సులు
Electric AC buses from Hyderabad to Vijayawada from tomorrow

పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయని, హైదరాబాద్ - విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 10 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోందని, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ఈ-గరుడగా నామకరణం చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ - మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరగనుందని, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఈ-గరుడ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌తి 20 నిమిషాల‌కో బ‌స్సు అందుబాటులో ఉండనుంది.

More Telugu News