సీబీఐకి కొత్త డైరెక్టర్ రాకతో.. ట్రెండింగ్లో సన్ రైజర్స్ స్టార్ క్రికెటర్.. ఇద్దరికీ సంబంధం ఏంటి?
- కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ కు సీబీఐ పగ్గాలు
- ఆయన పెద్ద కూతురును పెళ్లి చేసుకున్న మయాంక్ అగర్వాల్
- ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్న మయాంక్
ఇదిలావుంచితే, ఆయన సీబీఐ డైరెక్టర్ గా ఎంపికైన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ పేరు ట్రెండింగ్ గా మారింది. మయాంక్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వస్తున్నాయి.
దాంతో, అసలు ప్రవీణ్ కు, మయాంక్ అగర్వాల్ కు సంబంధం ఏంటి? అన్న చర్చ మొదలైంది. సీబీఐ నూతన డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. మయాంక్ కు పిల్లనిచ్చిన మావయ్య. ప్రవీణ్ పెద్ద కూతురు ఆష్రిత సూద్ ను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో పుట్టిన మయాంక్ తన స్నేహితురాలైన ఆష్రితకు 2017లో ప్రపోజ్ చేశాడు. పెద్దలు కూడా ఒప్పుకోవడంతో 2018లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. గతేడాది ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ ను ఈ ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ, ఈ సీజన్ లో మయాంక్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు.