Amitabh Bachchan: నీవెవరో నాకు తెలీదు మిత్రమా, కానీ థాంక్యూ: నెట్టింట అమితాబ్ బచ్చన్ పోస్ట్ వైరల్

Amitabh Bachchan revealed that he was getting late for work when he decided to take help from an unknown man
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచవ్యాప్తంగా అశేష జానాదరణను సొంతం చేసుకున్న నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్! వినియశీలి అయిన బిగ్ బీ తన నిరాడంబరతతోనూ ఆభిమానుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. తాజాగా ట్రాఫిక్ జంఝాటంలో చిక్కుకున్న ఆయన ఓ అపరచిత వ్యక్తి బైక్‌పై తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీనే సోషల్ మీడియాలో వెల్లడించారు. 

‘‘నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ మిత్రమా. నీవెవరో నాకు తెలీదు. అయినా నా మాట మన్నించి కోరుకున్న చోట డ్రాప్ చేశావు. ట్రాఫిక్ జంఝాటాన్ని తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు. నీకు మరోసారి థ్యాంక్స్’’ అని బిగ్ బీ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆయన మనవరాలు నవ్య నందా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీని షేర్ చేశారు. 

బిగ్ బీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి రావద్దని ఇటీవల ఆయన అభిమానులను అభ్యర్ధించారు. ఆదివారం మరో పనిపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే మళ్లీ కలుస్తానని భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Amitabh Bachchan

More Telugu News