ఇక ప్రతి గెలుపు ప్లే ఆఫ్ బెర్తు కోసమే... రాజస్థాన్ పై టాస్ గెలిచిన ఆర్బీబీ

RCB won the toss against Rajasthan Royals
ఐపీఎల్ పోరు కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్తుల కోసం పోటీ తీవ్రస్థాయికి చేరింది. చాలా జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు కనిపిస్తుండడంతో ఇక ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. 

ఈ నేపథ్యంలో, నేడు డబుల్ హెడర్ లో భాగంగా తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో రెండు మార్పులు జరిగాయి. జోష్ హేజెల్ వుడ్ స్థానంలో వేన్ పార్నెల్... హసరంగ స్థానంలో బ్రేస్వెల్ జట్టులోకి వచ్చారు. అటు, రాజస్థాన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడమ్ జంపాకు తుదిజట్టులో స్థానం కల్పించారు. 

పాయింట్ల పట్టికలో ఇరుజట్ల స్థానాలు పరిశీలిస్తే.... ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానంలో ఉంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్ ల్లో 5 విజయాలతో 7వ స్థానంలో ఉంది.
Go Back to Shorts
RCB
Toss
Rajasthan Royals
Jaipur
Play Off
IPL

More Telugu News