Karnataka: నేటి సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. సీఎంగా సిద్ధరామయ్య ఎన్నిక?

  • కర్ణాటకలో నేటి సాయంత్రం 6 గంటలకు సీఎల్పీ సమావేశం
  • పార్టీ అధ్యక్షుడు  మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సుర్జేవాల్ సమక్షంలో ఎమ్మెల్యేల సమావేశం
  • సీఎం సీటు ఎవరికనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి అంటూ ప్రచారం
Karnataka Congress to hold clp meeting today at 6 pm siddaramaiah to be elected as cm

కర్ణాటకలో గొప్ప విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నేటి సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న పార్టీ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కాగా, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత సుర్జేవాల్ సమక్షంలో జరగనున్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారు. అనంతరం, నేతలు గవర్నర్‌ను కలుస్తారు. 

సిద్ధరామయ్యను సీఎం, డికే శివకుమార్‌ను డిప్యుటీ సీఎంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలను కలుపుకుపోయేలా డిప్యూటీ సీఎంల ఎంపిక ఉంటుందని అక్కడి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లింగాయత్, వక్కళిగ, దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కబోతున్నాయట. సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.

More Telugu News