Viral Videos: నేలను తవ్వి మరీ పిల్లిని కాపాడిన కుందేలు.. చూసి తీరాల్సిన వీడియో ఇది!

Video of rabbit saving cat goes viral
  • నెట్టింట వీడియో వైరల్
  • రేకుల వెనకాల ఇరుక్కుపోయిన పిల్లి, బయటకు రాలేక అవస్థలు
  • పిల్లి కోసం నేలను తవ్వి చిన్న సొరంగం ఏర్పాటు
  • సొరంగం ద్వారా సేఫ్‌గా బయటకు వచ్చిన పిల్లి
నెట్టింట్లో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది కానీ కొన్ని మాత్రం నెటిజన్లను దిలిస్తుంటాయి. అమితంగా ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో.. ఓ పిల్లిని కుందేలు కష్టపడి మరీ కాపాడింది. రేకుల వెనక ఇరుక్కుపోయిన పిల్లి బయటకు రాలేక నానా అవస్థలు పడింది. 

మరి దాని అవస్థలు చూసి కుందేలు చలించిపోయిందో ఏమో కానీ వెంటనే రంగంలోకి దిగి పిల్లిని కాపాడింది. రేకుల కింద భాగంలో నేలను తవ్వి పిల్లి బయటకు వచ్చేలా మార్గం ఏర్పాటు చేసింది. దాని ద్వారా పిల్లి సేఫ్‌గా బయటకు వచ్చింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జంతువుల్లో ఇంతటి సున్నితత్వం కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. కుందేలు జంటెల్మెన్ లాగా ఉందే అని మరికొందరు వ్యాఖ్యానించారు.
Viral Videos

More Telugu News