Salman Khan: మమతా బెనర్జీని కలిసిన సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా

Salman Khan and Sonakshi Sinha to meet CM Mamata Banerjee
  • సల్మాన్ ఖాన్ కు శాలువా కప్పి స్వాగతించిన దీదీ
  • ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల కోసం వచ్చిన సల్మాన్
  • సల్మాన్ రాక తెలిసి తరలి వచ్చిన అభిమానులు
బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా తదితరులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. శనివారం సాయంత్రం కాళీఘాట్ లో ఉన్న దీదీ నివాసానికి వెళ్లారు. సల్మాన్ కు దీదీ శాలువా కప్పి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇరువురు దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల కోసం సల్మాన్ కోల్‌కతా వచ్చారు. ఈ సందర్భంగా మమతతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సల్మాన్ రాక విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన విడిది చేసిన హోటల్ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల కోసం సల్మాన్, సోనాక్షిలతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ప్రభుదేవా, ఆయుశ్ శర్మ తదితరులు శుక్రవారం సాయంత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.
Salman Khan
Mamata Banerjee

More Telugu News