Basavaraj Bommai: కర్ణాటక బీజేపీ కార్యాలయంలో కింగ్ కోబ్రా

  • బసవరాజు బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన పాము
  • భయాందోళనలకు గురైన నాయకులు, కార్యకర్తలు
  • కింగ్ కోబ్రాను పట్టుకొని అడవిలో వదిలేసిన వైనం 
Snake causes chaos at BJP Shiggaon camp office in Karnataka rescued

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా కర్ణాటక షిగాన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక అవాంఛనీయ సంఘటన గందరగోళానికి కారణమైంది. ఆఫీస్ లోని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో ఓ కోబ్రా కనిపించింది. బొమ్మై కార్యాలయానికి వచ్చిన కాసేపటికి కోబ్రాను గుర్తించిన కార్యకర్తలు, నాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ పామును పట్టి, అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఈ పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News