Karnataka: ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే జరుగుతోందా?.. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌దే ఆధిక్యం!

  • 54 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, జేడీఎస్
  • 13 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్న ఇతరులు
Early trends show Congress taking dominant lead over BJP

చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగ్గా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఫలితాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. 

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్‌ 54 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 40, జేడీఎస్ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అవి నిజం కావడం ఖాయమని అనిపిస్తోంది.

More Telugu News