Karnataka: కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యత

Congress crosses magic figure in Karnataka election results
  • ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత
  • 132 స్థానాల్లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్
  • 77 సీట్లలో ముందంజలో ఉన్న బీజేపీ
దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 132 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 77 స్థానాల్లో, జేడీఎస్ 15 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
Karnataka
Election Results
BJP
Congress

More Telugu News