Basavaraj Bommai: డీకే శివకుమార్ ను రేపటి వరకు ఆ ఆనందంలో ఉండనిద్దాం: కర్ణాటక సీఎం బొమ్మై సెటైర్

Let us leave DK Shivakumar in that happiness till tomorrow says CM Bommai
  • కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే 
  • మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న సీఎం బొమ్మై
  • యెడ్డీ నివాసంలో భేటీ అయిన బీజేపీ కీలక నేతలు
యావత్ దేశం ఉత్కంఠగా వేచి చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మరోవైపు తమకు క్లియర్ మెజార్టీ వస్తుందనే ధీమాను ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు వేటికవే వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, హంగ్ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. సంపూర్ణ మెజార్టీతో తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

 కాంగ్రెస్ కు 141 సీట్ల వస్తాయని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెపుతున్నారని, రేపటి వరకు ఆయనను ఆ ఆనందంలో ఉండనిద్దామని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిస్తే సీఎం ఎవరుండాలనే దాన్ని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. 

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసానికి బొమ్మైతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు వెళ్లారు. రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. 

Basavaraj Bommai
BJP
DK Shivakumar
Congress

More Telugu News