మహిళ డ్రైవింగ్.. కారు కింద నలిగిపోయిన టూ వీలర్లు
- కాన్పూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఘటన
- రద్దీ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళ
- రివర్స్ మోడ్ లో అదుపు తప్పిన కారు
కారు నడిపే మహిళ మద్యం మత్తులో ఉందా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఆమె కారును రివర్స్ మోడ్ లో పార్క్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఇలా జరిగినట్టు చెబుతున్నారు. పైగా మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే రద్దీగా ఉన్న రోడ్డులో ఆమె కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. సదరు మహిళపై ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. వేగాన్ని అదుపు చేసుకోవడంలో విఫలం కావడమే ఈ ప్రమాదానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు. కాన్పూర్ పట్టణంలోని ఫజల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది.